నీధనము నీఘనము ప్రభు యేసుదే
niidhanamu niighanamu prabhu yeesudee
పల్లవి
నీ దశమాభాగములెల్ల నీయ వెనుదీతువా
1వ చరణం
ధరలోన ధన ధాన్యముల నీయగా - కరుణించి కాపాడి రక్షింపగా పరలోక నాధుండు నీకీయగా - మరి యేసు కొరకీయ వెనుదీతువా "నీధన"
2వ చరణం
పాడిపంటలు ప్రభువు నీకియగా - కూడుగుడ్డలు నీకు దయచేయగా వేడంగ ప్రభుయేసు నామంబును - గడువేల ప్రభుకీయ ఓ క్రైస్తవా "నీధన"
3వ చరణం
వెలుగు నీడలు గాలి వర్షంబులు - కలిగించె ప్రభునీకు ఉచితంబుగా వెలిగించ ధరయందు ప్రభు నామము - కలిమి కొలది ప్రభునకర్పించవా "నీధన"
4వ చరణం
కలిగించే సకలంబు సమృద్దిగా - తొలగించె పలుభాధ భరితంభులు బలియాయె నీపాపముల కేసుడు - చెలువంగ ప్రభుకీయ చింతింతువా "నీధన"
5వ చరణం
పరిశుద్ద దేవుని మంధిరమున్ - పరిపూర్ణముగాను యోచించుడి పరిశుద్ధ బాగంబు విడదీయుడి - పరమాత్మ దీవెనలను బొందుడి "నీధన"