నింగిలో దేవుడు నిను చూడ
ningiloo deevudu ninu chuuda
🎵 TG-1579🌐 Telugu
పల్లవి
నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2) చెంత చేరి సంతసించుమా స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో||
1వ చరణం
పాపాల పంకిలమై శోకాలకంకితమై మరణించి మన కోసం కరుణించి ఆ దైవం దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో||
2వ చరణం
సాతాను శోధనలే శాపాల వేదనలై విలపించే దీనులకై అలరించు దీవెనలై శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల