నిన్ను తలచి నను నేను
ninnu thalachi nanu neenu
🎵 TG-2079🌐 Telugu
పల్లవి
నిన్ను తలచి నను నేను మరచి నీ సాక్షిగా ఇల నే బ్రతుకుచుంటిని (2) యేసయ్యా.. నీ కృప లేక నే బ్రతుకలేను (2) ||నిను తలచి||
1వ చరణం
జీవము లేని దైవారాధనలో నిర్జీవ క్రియలతో మృతుడనైతిని జీవాధిపతివై నా జీవితానికి నిత్య జీవము నొసగిన యేసయ్యా దారే తెలియని కారు చీకటిలో బ్రతుకే భారమై నలిగిపోతిని నీతి సూర్యుడా ఎదలో ఉదయించి బ్రతుకే వెలుగుతో నింపిన యేసయ్యా సద్గుణ శీలుడా సుగుణాలు చూచి హృదిలో నేను మురిసిపోతిని సుగుణాలు చూచుటకే నీవు సిలువలో నాకై నలిగిన యేసయ్యా