నృపా! విమోచకా! ప్రభూ వేలాది

nrupaa! vimoochakaa! prabhuu veelaadi

🎵 TG-039💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

నృపా! విమోచకా! ప్రభూ వేలాది నోళ్ల నీ కృపా జయప్రభావముల్ నుతింతు నెంతయున్.

1వ చరణం

కృపాధికార! దేవ! నీ సాయంబు జేయుమా భవత్ర్పభావ కీర్తులన్ జాటంగ నెల్లెడన్. ||నృపా! విమోచకా!||

2వ చరణం

భయంబు చింతఁ బాపును హర్షంబు పాపికి సౌఖ్యంబు జీవశాంతులు నీ నామ మిచ్చును. ||నృపా! విమోచకా!||

3వ చరణం

విముక్తి జేయు ఖైదిని పాపంబు బాపును పాపాత్ము శుద్ధుజేఁయును శ్రీయేసు రక్తము. ||నృపా! విమోచకా!||

4వ చరణం

జనాళి! పాపు లెల్లరు! శ్రీయేసున్ నమ్ముఁడి కృపావిముక్తులందుఁడి సంపూర్ణ భక్తితో. ||నృపా! విమోచకా!||

5వ చరణం

అర్పించె యేసు ప్రాణమున్ నరాళిఁగావను; యజ్ఙంపు దేవు గొఱ్ఱెపై నఘంబు వేయుఁడి. ||నృపా! విమోచకా!||

6వ చరణం

సత్కీర్తి స్తోత్ర ప్తేమల నభాన భూమిని సర్వత్ర దేవుఁడొందుగా సద్భక్త పాళిచే. ||నృపా! విమోచకా!||

Report Error