ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ

okka manuju derussaleemunundi yeriko

🎵 TG-541💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు వతో వెడలుచుండె కొంత ధనముతో ||ఒక్క మనుజు||

1వ చరణం

మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు గొట్టి విడిచి వెళ్లిరి ||ఒక్క మనుజు||

2వ చరణం

అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె వాని నాదరింపక ||ఒక్క మనుజు||

3వ చరణం

వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి పోయె గరుణలేకను ||ఒక్క మనుజు||

4వ చరణం

పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి గరుణతోడ భేదమొంచక ||ఒక్క మనుజు||

5వ చరణం

నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు వాహనముమీద నూరు చేర్చెను ||ఒక్క మనుజు||

6వ చరణం

అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను జూచి యాదరింపవలయును ||ఒక్క మనుజు||

Report Error