ఒక్కడే యేసు ఒక్కడే - ఒక్కడే పరిశుద్ధుడు

okkaddee yeesu okkaddee - okkaddee parishuddhuddu

🎵 TG-1273💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

ఒక్కడే మహా దేవుడు మహిమోన్నతుడు లోకానికి రక్షకుడు యేసు ఒక్కడే

1వ చరణం

పాపిని విడిపించువాడు - యేసు ఒక్కడే పాపిని ప్రేమించువాడు - యేసు ఒక్కడే జీవ మార్గమై - సత్య దైవమై మోక్షానికి చేర్చువాడు యేసు

2వ చరణం

అద్వితీయ దేవుడు యేసు ఒక్కడే అద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే ఆదరించి ఆశ్రయమిచ్చి అనుక్షణము కాపాడు యేసు ఒక్కడే

3వ చరణం

నిత్యము ప్రేమించువాడు యేసు ఒక్కడే నిత్య శాంతి నిచ్చువాడు యేసు ఒక్కడే నా వేదనలో నా బాధలలో నా అండగా నిలుచువాడు యేసు ఒక్కడే

4వ చరణం

మరణము గెలచినవాడు యేసు ఒక్కడే మరల రానున్న వాడు యేసు ఒక్కడే పరిశుద్ధులను ఆ పరమునకు కొనిపోవువాడు యేసు ఒక్కడే

Report Error