ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు

oo bethleheemu graamamaa! saddeemileekayu

🎵 TG-133💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ బెత్లెహేము గ్రామమా! సద్దేమిలేకయు నీవొంద గాఢనిద్రపై వెలుంగు తారలు కానేమి, నిత్యజ్యోతి జ్వలించు నీతమిన్ పెక్కేండ్ల భీతివాంఛలీ రాత్రి తీరె నీలోన్.

1వ చరణం

మరియకేసుపుట్టెను నిద్రింప మర్త్యులు పై గూడి దూతల్వింతయౌ ప్రేమన్వీక్షింతురు చాటుడో వేగుచుక్కల్ ఎ శుద్ధజన్మము దైవానకు నున్నతుల్ భువిన్ శాంతంచు పాడుడీ. ||ఓ బెత్లెహేము||

2వ చరణం

సద్దేమి లేక వెచ్చగా! ఈ వింత దానము ఆరీతి దేవుడిచ్చుపై వరాల్ నరాళికి నరుండెరుంగకున్నన్ ఎ పాపధాత్రిలో దీనులంగీకరించిన యేసుందుజొచ్చును. ||ఓ బెత్లెహేము||

3వ చరణం

ఓ బెత్లెహేము పావన వత్సా! మా పై దిగు పోగొట్టి పాపముల్ మాలో నీ వేళ పుట్టుము సువార్త క్రిస్మస్ దూతల్ చెప్పంగ విందుము మా యొద్ద నుండరమ్ము మా ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్. ||ఓ బెత్లెహేము||

Report Error