ఓ దేవ రక్షకా నే

oo deeva rakssakaa nee

🎵 TG-392💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో నిన్ జూతును నా మొఱ్ఱాలించుము నా పాప మార్పుము నన్నింక నీ దరిన్ సదా యుంచు.

1వ చరణం

మూర్ఛల్లు నాత్మకు బలం బొసంగుము భవత్కృఋపన్ నాకై చావొందిన నిన్నెల్లకాలము ఆసక్తి శుద్ధితోఁ బ్రేమింప నీ. ||ఓ దేవ||

2వ చరణం

నే హాని నొందిన నన్ జింత క్రమ్మ్రినఁ గాపాడుము పోఁగొట్టు చీఁకటి కన్నీళ్లఁ దుడ్వుము దొలంగ నీకునన్ నీ సన్నిధి. ||ఓ దేవ||

3వ చరణం

నా యాయు వంతమై మృత్యూగ్ర బాధలు నన్నొందుచో సంశయ భీతులు తొలగఁ బ్రేమతో నా దేవ, యాత్మకు మోక్షం బిమ్ము. ||ఓ దేవ||

Report Error