ఓ క్రైస్తవ యువకా
oo kraisthava yuvakaa
🎵 TG-2403🌐 Telugu
పల్లవి
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2) నీ బ్రతుకంతా మారుటే మేలు కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||
1వ చరణం
పాపపు చీకటి బ్రతుకేలా శాపము భారము నీకేలా పావన యేసుని పాదము చేరిన జీవము నీదగురా మారిన జీవిత తీరులలో మానక నీప్రభు సేవకురా మహిమ కిరీటము మనకొసగును ఘనమే నీదగురా భయపడి వెనుకకు పరుగిడక బలమగు వైరిని గెలిచెదవా బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన గెలుపే నీదగురా