ఓ సంఘమా సర్వాంగమా

oo sanghamaa sarvaangamaa

🎵 TG-1734🌐 Telugu
పల్లవి

ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము (2) పొందితినే యేసునందు (2)       ||ఓ సంఘమా||

1వ చరణం

క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు సహియింతువా తీర్పునాడు చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా సజీవముగా నున్నావా చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగును నులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమో నీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో ఆసక్తితో రక్షణ పొందుమా

Report Error