పల్లవి
ఓ వింత! నా రక్షకుఁడా నాకై నీ విలువ రక్తము కార్చితివా జీవాధిపతి మృతిఁ జెందె నహహా పురుగు వంటి నాకై నీ జీవ మర్పించి నావా ||ఓ వింత!||
1వ చరణం
నేను జేసిన పా పములకు నాయన మ్రానిమీఁదను మూల్గినావా నేను గ్రహింపలేని నీ జాలి కరుణ మితి లేని ప్రేమ దీని వలనను గనుపడుచు నున్నది ||ఓ వింత!||
2వ చరణం
పరమ శరీరుఁడు తా మరణ రక్తంబుచేతఁ గరుణతో నన్నుఁ బ్రోచినాఁ డా మరుతునా యీ ప్రేమ నా మరణంబు నందు సహా కర్తృ కటాక్షములు కలకాల ముండు నాతో ||ఓ వింత!||
3వ చరణం
నా యేసు నాధ నీకు నేనచ్చియున్న దెల్ల నా లేమితోఁ బ్రేమ గదా నియమంబు గల ప్రభువా నీకెట్లు చెల్లించెదను నన్ను నేనే నీకు నర్పించుకొనుట గాక ||ఓ వింత!||