పాపకూపమునందు పడి మునిగియున్నావు పాటింపవది

paapakuupamunandu padi munigiyunnaavu paatinpavadi

🎵 TG-308💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పాపకూపమునందు పడి మునిగియున్నావు పాటింపవది యెందుకు పాప జన్మము పాపకర్మము పాపపూరితమైన హృదయము ఓపరాని భయంకరోగ్రత శాపములు సమకట్టియుండగ ||పాపకూపమునందు పడి||

1వ చరణం

పరమాత్మ మీదనే గురి నిల్పు మని దెల్పు వరబోధమది నెంచవు నిరత మును రాత్రియును బవలును నిరవు ధనమును ఘనము సౌఖ్యము లరయు చుందువు క్షణము నీవా పరమ ధర్మము సరకుజేయవు ||పాపకూపమునందు పడి||

2వ చరణం

కనివినంగ నుదగని పనికిమాలిన క్రియల దనిసి భ్రమయుచు నుందువు ఘనుల పెద్దల జననీజనకుల ననిశమును నిరసించి మెలగెడు వినయరహితంబైన జీవిత మునకు నేమి ఘటిల్లునోకను ||పాపకూపమునందు పడి||

3వ చరణం

పెరవారలను బ్రియసో దరులుగ బ్రేమింప పరమాత్మపురికొల్పదే పరులపై ద్వేషంబు పగగొని పలుతెరంగుల బాధపఱచుచు ప్రాణహత్య లొనర్చు నీకు పరమ పదము లభింపసాధ్యమె ||పాపకూపమునందు పడి||

4వ చరణం

పాప పరిహారార్థ ప్రాయశ్చిత్తము జేసి ప్రాణమర్పించె నెవరో ఆ పరాత్పరు నాశ్రయించుము శాపభారము బాపిబ్రోచును మాపు రేపునులేని స్వర్గ ప్రాప్తికల్గును నిత్యశుభమగు ||పాపకూపమునందు పడి||

5వ చరణం

పాపభారము క్రింద పడికుందు మీకునే పరగనిత్తును శాంతిని దాపు నకు రండంచు పతితుల దయను బిలచెడు యేసుక్రీస్తును పాపి కాశ్రయుడంచు నమ్మి భక్తితో ప్రార్థించి వేడవే ||పాపకూపమునందు పడి||

6వ చరణం

శరణీయ వరమోక్ష పురమందు ఘనసౌఖ్య పరమానందము లొందుచు వరుల దూతల భక్తగణముల సరసదేవు స్మరించు భాగ్యము గురుడు నీకిడఁగోరి పిలుచుచు కరము జాపెను కౌగిలింపవె ||పాపకూపమునందు పడి||

Report Error