పాపిని కృప జూపవయ్యా దాపు

paapini krupa juupavayyaa daapu

🎵 TG-329💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పాపిని కృప జూపవయ్యా దాపు జేరితిని యేసయ్యా పాప భారము క్రింద శ్రమపడి కృంగియున్నాను యేసయ్యా ||పాపిని కృప||

1వ చరణం

వేష భాషలతోడ నిండి మోసపోయితిని యేసయ్యా దోసిలొగ్గి నిన్ను చేరితి దాసునిగ బ్రోవు యేసయ్యా ||పాపిని కృప||

2వ చరణం

నీతి లేని నాదు జీవిత మేల నికనయ్యా యేసయ్యా నీతి గరపి బ్రోవు మయ్యా నీతి నిడవయ్యా యేసయ్యా ||పాపిని కృప||

3వ చరణం

నీదు సిలువలోని ప్రేమ నెంచదర మౌన? యేసయ్యా నాదు కలుష మంత బాపి కనికరింపు మా యేసయ్యా ||పాపిని కృప||

4వ చరణం

నీదు రక్తధారలేయిల పాపికాశ్రయము యేసయ్యా నీతిమంతుల జేయుమయ్యా నీతిసూర్యుండా యేసయ్యా ||పాపిని కృప||

5వ చరణం

దాపుగోరినవారలకు నీ ప్రాపుజూపితివి యేసయ్యా పాపశాపము బాపి నిత్య జీవమిడవయ్యా యేసయ్యా ||పాపిని కృప||

6వ చరణం

శాంతి గోరువార లెల్లనీ చెంతకరగినచో యేసయ్యా చింతలెల్ల దీర్చగలవు శాంతి నొసగెదవు యేసయ్యా ||పాపిని కృప||

7వ చరణం

పరమరక్షక నీదు ప్రేమ నెరుగ తరమౌన యేసయ్యా పరుల మైన మమ్ము బ్రోవ వేచియున్నావా యేసయ్యా ||పాపిని కృప||

8వ చరణం

నాదు హృదయము నీదెసుమ్మా నీవె గైకొనుమా యేసయ్యా శుద్ధ హృదయము జేసి నను నీ సుతునిగా జేయు యేసయ్యా ||పాపిని కృప||

Report Error