పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో

paathaallanloo aathmala aarthanaadam bhuulookanloo

🎵 TG-2930🌐 Telugu
పల్లవి

పాతాళంలో ఆత్మల ఆర్తనాదం భూలోకంలో సువార్తల సునాదము (2) మించుతుంది సమయం – పొంచి ఉంది ప్రమాదం ఎంచుకో స్వర్గం – నరకం గమనించుకో ఎటు నీ పయనం ||పాతాళంలో||

1వ చరణం

ఆరని అగ్ని తీరని బాధ పాతాళమందున్నది విందు వినోదం బంధువు బలగం ఈ లోకమందున్నది రక్షణను పొందమంటే పొందుకోరు ఇక్కడ రక్షించే వారులేక రోధిస్తారక్కడ (2)         ||పాతాళంలో||

2వ చరణం

ఇది రంగుల లోకం హంగులు చూపి రమ్మని పిలుస్తున్నది వాక్యము ద్వారా దేవుడు పిలచినా ఈ లోకం వినకున్నది ప్రజల కొరకు పాతాళం నోరు తెరుచుకున్నది ఎంత చెప్పినా లోకం కళ్ళు తెరవకున్నది

Report Error