పల్లవి
కాచి కాపాడినావు - నన్ను రక్షించినావు - 2 గడచిన కాలమంతా - నన్ను దీవించినావు - 2
1వ చరణం
ఇశ్రాయేలీల జనాంగమును - ప్రేమతో నీవు పిలిచినావు - 2 నలబై ఏళ్ళ ప్రయణములో - కొరతలేక నడిపినావు - 2 నీవే నాతోడుగా... అండగా నిలువగా .... - 2 గడచిన కాలమంతా - నన్ను రక్షించినావు - 2
2వ చరణం
అబ్రాహామును ఆశీర్వదించి - గర్బఫలము ఇచ్చినావు - 2 ఆస్తి ఐశ్వర్యం సర్వసంపదలిచ్చి - శారా కోరిక తీర్చినావు - 2 నీవే నాతోడుగా.... అండగా నిలువగా .... 2 గడచిన కాలమంతా - నన్ను దీవించినావు - 2