పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా
panpumu deevaa deevenalathoo - panpumu deevaa
🎵 TG-1131🌐 Telugu
పల్లవి
పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా పంపుము దయచేత - పతిత పావన నామ పెంపుగ నీ సేవ - బ్రియ మొప్ప నొనరింప పంపుము దేవా దీవెనలతో - పంపుము దేవా
1వ చరణం
మా సేవనుండిన - మా వెల్తులన్నియు యేసుని కొరకు నీ వెసగ క్షమియించును ||పంపుము దేవా||
2వ చరణం
వినిన సత్యంబును - విమలాత్మ మది నిల్పి దిన దినము ఫలములు దివ్యముగ ఫలియింప ||పంపుము దేవా||
3వ చరణం
ఆసక్తితో నిన్ననిశము సేవింప భాసురంబగు నాత్మ వాసికెక్కగనిచ్చి ||పంపుము దేవా||