పరలోకము నా దేశము పరదేశి

paralookamu naa deeshamu paradeeshi

🎵 TG-2863🌐 Telugu
పల్లవి

పరలోకము నా దేశము పరదేశి నేనిల మాయలోకమేగ నేను యాత్రికుడను (2) ఎంతో అందమైనది పరలోకము అసమానమైనది నా దేశము ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను సాగింతును (2)          ||పరలోకము||

1వ చరణం

దూతలు పాడుచుందురు పరమందున దీవా రాత్రమునందు పాడుచుందురు పావనుని చూచి నేను హర్షింతును నిత్యము రక్షకుని చెంతకు ఎప్పుడేగెదన్ వీక్షించెద నెప్పుడు నాదు ప్రియుని కాంక్షించెద నా మదిలో ఆయన చెంతనుండ అద్దరికి ఎప్పుడు నేను వెళ్లెదన్ అగుపడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచెదను పరిశుద్ధులెల్లరిన్ నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండునచ్చట పొందెదను విశ్రాంతిని శ్రమలన్నియు వీడి

Report Error