పరమ రాజ్యమునకు నరులు తిరిగి
parama raajyamunaku narulu thirigi
పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను ||పరమ రాజ్యమునకు||
వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయుండు మదిని దలఁచుచున్ ||పరమ రాజ్యమునకు||
అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను ||పరమ రాజ్యమునకు||
బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు నీ బోధ నెఱుఁగుదున్ ||పరమ రాజ్యమునకు||
మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప నరులు చేయరు ||పరమ రాజ్యమునకు||
అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను ||పరమ రాజ్యమునకు||
క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు నిజము క్రీస్తు పల్కెను ||పరమ రాజ్యమునకు||
వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను ||పరమ రాజ్యమునకు||
అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న మోక్ష రాజ్య మొంద రనుచును ||పరమ రాజ్యమునకు||