పరమ రక్షక యేసు ప్రభువా

parama rakssaka yeesu prabhuvaa

🎵 TG-168💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే ధరజనంబులుసేయు బహువిధ దురితములు క్షమియించి సద్గతి తెరవు జూపి తరింపఁజేసెడి దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమ రక్షక||

1వ చరణం

క్షితి నబ్ధి తీర పై కతయైన నెన్ననా యితియౌను లెక్కింపఁగా కుతల జన్మంబెత్తియేనిట బ్రతుకు దినముల జేయునఘములు మతి దలపనిమితా యుతంబులు పతితు డనునాగతి యెరుంగను ||పరమ రక్షక||

2వ చరణం

పసలేని మాయా దు ర్వ్యసనంబులను జెంది దెసదప్పి యున్నాఁడను వసుధలో దుష్టునికి లోఁబడి మసలజాలని బలహీనత గసటు కన్నులగప్పి కడు మా నసము దూలి విలాపినైతిని ||పరమ రక్షక||

3వ చరణం

మదితప్పి గొఱ్ఱెల మంద బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు వదలకెపుడు దురాత్మలైరి స ముదయమునఁ బడితిరిగి వడిచెడి మదికి విశ్రమమేమి లేమిని హృదయ సంతాపముల సుడిఁబడి ||పరమ రక్షక||

4వ చరణం

మదపున్నాగము భంగి మత్తిల్లి దుర్భావ హృదయుఁడనై చెడితిని గొదగొనుచు గాయములతో నా యెద దృఢంబించుకయు లేమినిఁ గదల శక్యము గాక మూల్గుచు గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమ రక్షక||

5వ చరణం

అమిత దురాత్ముఁడ నని కడఁ ద్రోయక క్షమియింపు మీ కరుణచే తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు తమము గప్పియు గలుషకానన సమితిలోఁబడి శ్రమలు నొందుచు ||పరమ రక్షక||

Report Error