పరమేదేశ మిదిగో నూతన యెరూస
parameedeesha midigoo nuuthana yeruusa
పరమేదేశ మిదిగో నూతన యెరూస లేమదిగో సోదర తిర మగు పురమది దివ్య సుందరము తరముగాదు త ద్దయు వర్ణింపగ ||పరమేదేశ మిదిగో||
ద్వాదశ రత్నములా ప్రోలుపు నాదులుగా నుండు సోదర యాదట దీరక నాణి ముత్తియ వి నోదద్వారముల నమరి వెలయు ||పరమేదేశ మిదిగో||
శుద్ధ సువర్ణమున నెంతో శుద్ధి మార్గముండు సోదర శుద్ధు లెల్ల బరి శుద్ధ గానముల శుద్ధుని నెప్పుడు స్తుతి యొనరింతురు ||పరమేదేశ మిదిగో||
పరమ జనకు సముఖం బచ్చట నరులతోడ నుండన్ సోదర నరులు దేవుని నరులై యుందురు పరమాత్ముడు దన వారలతో నుండును ||పరమేదేశ మిదిగో||
కన్నీరుండదుగా దేవుఁడు గన్నుల దుడుచునుగా సోదర యెన్నఁగ మరణం బిక నుండదు మరి చెన్నుగ భేదము శీఘ్రము దొలఁగును ||పరమేదేశ మిదిగో||
పరమపురమునందు దేవుని కిరవొకటుండదుగా సోదర పరమ జనకుడును గొఱ్ఱె పిల్లయును మురువుగ నొక మందిరమై యుందురు ||పరమేదేశ మిదిగో||
రవి చంద్రులతోడన్ నిజముగ నవసరముండదుగా సోదర యవిరతముగ యే సువె ఘనతరవై భవమై ప్రభతో బరగుచు నుండును ||పరమేదేశ మిదిగో||
సంతతంబిచ్చోట సాధులు స్తుతి సేతురు దేవున్ సోదర యతులితంబుగా హర్షమకుటమును సతతము దాల్తురు స్వామి సన్నిధిని ||పరమేదేశ మిదిగో||
ఆఁకలియుండదుగా నిజముగా నాకుల ముండదుగా సోదర ప్రాకటముగ జీ వ జలంబచ్చట నీకు నొసంగును నిరతము వరదుఁడు ||పరమేదేశ మిదిగో||
ప్రభు సన్నిధినుండి పారును శుభనది సుఖ మియ్యన్ సోదర యుభయ తీరముల నుండు తరులు సౌ రభ దీప్తిని శుభ రక్షణ ఫలమిడు ||పరమేదేశ మిదిగో||