పరిమపురి కల్పభూజ నిరత భూనరుల
parimapuri kalpabhuuja niratha bhuunarula
పల్లవి
పరిమపురి కల్పభూజ నిరత భూనరుల పూజ యురుతరచిత మహిమతేజ వరస్తుతి సల్పెదము రాజ
1వ చరణం
జనక సుత శుద్ధాత్మ యను పేరిట యేకాత్మ ఘనతర సంరక్ష ప్రేమ ననిపి మము కనికరించు ||పరిమపురి కల్పభూజ||
2వ చరణం
నీవే మా ప్రాపువంచు నెరనమ్మి యందు మంచు భావంబున దలఁచు వారిఁ బావనులఁ జేయు సదా ||పరిమపురి కల్పభూజ||
3వ చరణం
కలుషంబులను హరింప నిల సైతానును జయింప బలుమారు నిను దలంచు బలము గల ప్రభుఁడ వీవే ||పరిమపురి కల్పభూజ||
4వ చరణం
ఈ లోక పాపనరులు చాల నిను నమ్మి మరల దూలిచే దారుణ సై తానును బడఁద్రొక్కివేయు ||పరిమపురి కల్పభూజ||
5వ చరణం
అల్పా ఓ మేగయును నాద్యంతంబులును కల్పాంత స్థాయువైన కర్తా కరుణించు మమును ||పరిమపురి కల్పభూజ||