పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక్తిబం ధురము

parishuddhaathma prabhuni varadivyashakthibam dhuramu

🎵 TG-247💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరిశుద్ధాత్మ ప్రభుని వరదివ్యశక్తిబం ధురము ధరణికిజీవ సంజీవము పరమౌన్నత్యంబైన పరలోక సువిశేష పరమార్థములు దెలుపు నెఱిమార్గము ||పరిశుద్ధాత్మ ప్రభుని||

1వ చరణం

ఆపత్కాలమునందు ప్రాపయి మానవజాతి కాపయి సంరక్షించి ఏపారును పాపాంధకారమున బడి మ్రగ్గి శోకించు పాపజాతికి దీప రాశియై రహియించు కృపయు కనికరములు గుంఫించి మధురాతి ప్రభగా భాసిల్లెడు పరమార్థము అపభ్రంశకార్యముల కెపుడు తావీయక సుపురోగతిని జూపి శోధించును ||పరిశుద్ధాత్మ ప్రభుని||

2వ చరణం

బండలనుపమించు గుండియల కదలించు నిండుశక్తి ఘటించు నీతి బెంచు ఎండిన యెదలను నిండించు రక్షణో ద్దండ విలసిత భాగ్య దానమ్ములు దండిగానసమాన ధైర్యోత్సాహములిచ్చి మెండుగా నాదరము మేళవించి మండుచున్న పాప మరణాగ్ని జ్వాలల నుండి పాపిని గాచు నండయౌచు ||పరిశుద్ధాత్మ ప్రభుని||

3వ చరణం

శాంతి సమాధాన సౌజన్యభావమ్ము కాంతిమంతము గల్గు కారుణ్యము అంతములేనట్టి ఆనంద శుద్ధాత్మ శాంతిదాంతియొసంగి సంరక్షించు ఎంతో సంతోషముతో అంతుబొంతులేని వి క్రాంతి బలత్యాగముల గావింప జేయు చింతా ధ్వాంతములోన చెదరికొట్టుకపోవు శాంతిలేని జనతకు సౌఖ్యాస్పదము ||పరిశుద్ధాత్మ ప్రభుని||

Report Error