పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ

parishuddhaathmunim bondumu prabhuvichchedu varasahaayunim

🎵 TG-250💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరిశుద్ధాత్మునిఁ బొందుము ప్రభువిచ్చెడు వరసహాయునిఁ బొం దుము పరిశుద్ధవర్తనకు పరమసాహాయ్యంబుఁ పరముఁజేరువఱకు పరి పూర్తిగా దొరకు ||పరిశుద్ధాత్మునిఁ బొందుము||

1వ చరణం

పరిశుద్ధాత్మునిఁ గల్గిన మన రక్షణ పరిపూర్ణమై యుండును పరమ రక్షకుఁడిచ్చు పరిపూర్ణ రక్షణను పరమానందముతోడఁ పరగఁగైకొను మిపుడే ||పరిశుద్ధాత్మునిఁ బొందుము||

2వ చరణం

పరిశుద్ధాత్మునిఁ గల్గిన బైబిలువాక్య పరమసారము తేటగుఁన్ పర మండలపుఁ తండ్రి పరిశుద్ధచిత్తంబు పొరపాటులేకుండ విరివిరిగాఁ దెలియును ||పరిశుద్ధాత్మునిఁ బొందుము||

3వ చరణం

పరిశుద్ధాత్మునిఁ గల్గినఁ బ్రార్థనలందుఁ పరమ పాటవ మబ్బును సరిగాఁ బ్రార్థించెడు సరణియుఁ దెలియును వరములను బొందుటకు తెరువులభియించును ||పరిశుద్ధాత్మునిఁ బొందుము||

4వ చరణం

పరిశుద్ధాత్మునిఁ గల్గిన శోధనములఁ పరమ విజయము గల్గును దురితంపు శోధనలఁ దొలగింప నా ప్రభువు పరమశక్తినొసంగి కరుణతో జయమిచ్చు ||పరిశుద్ధాత్మునిఁ బొందుము||

5వ చరణం

పరిశుద్ధాత్మునిఁ గల్గిన జీవితమెల్లఁ పరిశుద్ధముగ నుండును పరిశుద్ధ జీవితము కరము సాధ్యంబగును పరిశుద్ధాత్ముని శక్తిన్ వర్తింపఁగలమట్లు ||పరిశుద్ధాత్మునిఁ బొందుము||

Report Error