పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని

parishuddhi parishuddhi parishuddhi yani

🎵 TG-504💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ధి యని వినఁ బడు పుర మదిగో పద పదరే ప్రియులారా పరమేశ్వరుని చేతఁ బరిపాలనముఁ గల్గి చిరమై భాసురమై సు స్థిరమై సుందరమైన ||పరిశుద్ధి పరిశుద్ధి||

1వ చరణం

రవితోను కుముదబాం ధవుతోను మఱి దీప చ్ఛవితోను దాని కవ సర మింతలేదు అవిరతమునఁ గ్రీస్తుఁ డందుండుఁ ప్రభతో సం స్తవమై వైభవమై యు త్సవమై వెల్గుచు నుండుఁ ||పరిశుద్ధి పరిశుద్ధి||

2వ చరణం

గొదయైన మఱియే యా పదయైన దగయైన మొదలే లేకుండు న ప్పుర వాసు లందు మృదు జీవోదకము ల ర్మిలి నిరంతర మిచ్చు గుదురుగ నెదురుగఁ గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి పరిశుద్ధి||

3వ చరణం

ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట నుభయ తీరములందు నుండు వృక్షములు సౌ రభదీప్త శుభములై రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి పరిశుద్ధి||

4వ చరణం

జననంబు మరణంబు సంసార సుఖబాధ లనుభవించుట గల్గ దా పురమునందు మును నీతి కొఱ కాప దను బొందు తనవారి కనునీ ళ్లన్నియు దుడుచు మన దేవుఁ డందుండి ||పరిశుద్ధి పరిశుద్ధి||

5వ చరణం

వెలకంద రాని ని శ్చలమైన ఘన జీవ విలపత్కిరీటము ల్గల వప్పుర మునఁ బిలిచి నప్పుడె విభుని పెండ్లి విందున కేగు కుల బంధువులకు ని చ్ఛల నిచ్చు దేవుఁడు ||పరిశుద్ధి పరిశుద్ధి||

Report Error