పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు

parishuddhudavai – mahima prabhaavamulaku

🎵 TG-1340🌐 Telugu
పల్లవి

పరిశుద్ధుడవై – మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు బలవంతుడవై – దీనుల పక్షమై కృప చూపు వాడవు (2) దయాళుడవై – ధారాళముగా నను దీవించిన శ్రీమంతుడా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా (2)        ||పరిశుద్ధుడవై||

1వ చరణం

నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిను సేవించుటకు నీ మహిమ ప్రభావమును కిరీటముగా ధరింపజేసితివి శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్ధనలు సఫలము చేసితివి ||ఆరాధన||

2వ చరణం

నీ నిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు నీ కరుణా కటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి ఆనందకరమైన దేశములో నేను నిను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి మేఘ వాహనుడవై వచ్చుఁవరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుల కాంక్షను సంపూర్ణ పరచెదవు

Report Error