పల్లవి
చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగి పోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి
1వ చరణం
నా యేసుతో కలసి పోరాడుచున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయనే నా యేసు కొరకు సమర్పించుకున్నాను ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||
2వ చరణం
నా యేసు వెళ్ళిన మార్గము లేనని అవమానములైనా ఆవేదనలైనా నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||
3వ చరణం
ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమందు ఆ సింహాసనం నా గమ్యస్థానం ఆగిపోను నేను సాగిపోవుచున్నాను. ||పోరాటం||