ప్రాణమా నా ప్రాణమా ప్రియ

praannamaa naa praannamaa priya

🎵 TG-2302🌐 Telugu
పల్లవి

ప్రాణమా నా ప్రాణమా ప్రియ యెహోవాను సన్నుతించుమా ప్రియ యెహోవా చేసిన మేలులను నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా||

1వ చరణం

గత కాలములన్నిటిలో కృపతోనే నడిపించెను (2) కరుణ కటాక్షమనే కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా||

2వ చరణం

నిను విడువక ఎడబాయక నిత్యం నీకు తోడైయుండెను నీవు నడిచిన మార్గములో నీకు దీపమై నిలచెనుగా పాప శాపము వ్యాధులను పారద్రోలియే దీవించెను పరిశుద్ధుడు పరమ తండ్రి బలపరిచెను తన కృపతో మహా ఆనంద మానందమే మహారాజా నీ సన్నిధిలో మహిమగల మహారాజా మనసారా స్తుతించెదను

Report Error