ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా

praarthana shakthi naaku kaavaalayyaa

🎵 TG-1363🌐 Telugu
పల్లవి

ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా (2) యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావలయ్యా (2)      || ప్రార్థన ||

1వ చరణం

ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా ప్రార్థించి నిను చేరు భాగ్యమీయుమా నిరంతరం ప్రార్థింప కృపనీయుమా (2)       || ప్రార్థన ||

2వ చరణం

సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావలయ్యా నీతో నడిచే వరమీయుమా నీ సిలువను మోసే కృపనీయుమా పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి నే పాడు చోటెల్ల దిగిరా దేవా చిన్న వయసులో అభిషేకించిన యిర్మియా వలె ఈ చిన్న వాడిని అభిషేకించు (2)          || ప్రార్థన ||

Report Error