ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన

praarthana vinedi paavanudaa praarthana

🎵 TG-383💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన వినెడి||

1వ చరణం

శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ||ప్రార్థన వినెడి||

2వ చరణం

పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగ మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన వినెడి||

3వ చరణం

దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన వినెడి||

4వ చరణం

శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైని నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన వినెడి||

Report Error