ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం

prabhuvaa kaachithivee intha kaalam- kaachithivee intha kaalam

🎵 TG-1141🌐 Telugu
పల్లవి

ప్రభువా కాచితివే ఇంత కాలం- కాచితివే ఇంత కాలం చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||

1వ చరణం

కోరి వలచావు నాబ్రతు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా (2) నన్ను వలచావులే మరి పిలచావులే అరచేతులలో నను చెక్కు కున్నావులే (2) ||ప్రభువా||

2వ చరణం

నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా (2) పాపం కడిగావులే విషం విరచావులే నను మనిషిగా ఇలలో నిలిపావులే (2) ||ప్రభువా||

Report Error