ప్రభువా కాచితివి ఇంత కాలం

prabhuvaa kaachitivi inta kaalan

🎵 TG-1312💿 Telugu Christian Songs🌐 Telugu
పల్లవి

చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా - నీ సాక్షిగా నే జీవింతునయ్యా ||ప్రభువా||

1వ చరణం

కోరి వలచావు నాబ్రతుకు - మలిచావయా మరణ చాయలు అన్నిటిని - విరిచావయ్యా నన్ను తలచావులే మరి పిలచావులే నీ అరచేతులలో నను చెక్కు కున్నావులే ||ప్రభువా||

2వ చరణం

నిలువెల్ల గోరపు విషమేనయ్యా మనిషిగ పుట్టిన సర్పానయ్యా విషం విరచావులే పాపం కడిగావులే నను మనిషిగా ఇలలో నిలిపావులే ||ప్రభువా||

3వ చరణం

బాధలు బాపితివి నీవేనయ్యా నా కన్నీరు తుడిచితివి నీవెనయ్యా నన్ను దీవించితివి నన్ను పోషించితివి నీ కౌగిలిలో నన్ను చేర్చుకున్నావులే ||ప్రభువా||

Report Error