ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
prabhuvaa nii kaluvari tyaagamu - chuupenee nii paripuurnnatanu
పల్లవి
నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే "ప్రభువా"
1వ చరణం
నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి - 2 లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే - 2 "ప్రభువా"
2వ చరణం
జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే - 2 శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే - 2 "ప్రభువా"
3వ చరణం
సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2 పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే - 2 "ప్రభువా"