ప్రేమా మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ...ఆ
preemaa mruthadhaaralu chindina mana yeesuku samamevaru aa...aa
🎵 TG-1144🌐 Telugu
పల్లవి
ప్రేమా మృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ...ఆ.. ప్రేమయే తానై నిలచీ - ప్రేమ వాక్కులను పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి - ప్రేమా నగరికి చనియే...
1వ చరణం
నిశ్చలమైన ప్రేమ మూర్తికి - ఇలలో తావేది ఆ..ఆ.. (2) ప్రేమ ద్రోహులే కాని ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా - సమయమిదే కనుగొనరా ||ప్రేమా మృతధారలు||
2వ చరణం
ఎంత గోర పాపాత్ములనైనా - ప్రేమించెను రా రా ఆ.. ఆ..(2) పాప భారముతో రారా పాదములా పై పడరా పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు ||ప్రేమా మృతధారలు||
3వ చరణం
ఇంత గొప్ప రక్షణ ను - నిర్లక్ష్యము చేసెదవేల ఆ..ఆ..(2) రక్షణ దినమిదియే రా- తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము ||ప్రేమా మృతధారలు||