ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు

preemaa puurnnudu praanna naathudu

🎵 TG-2741🌐 Telugu
పల్లవి

ప్రేమా పూర్ణుడు ప్రాణ నాథుడు నను ప్రేమించి ప్రాణమిచ్చెను (2) నే పాడెదన్ – కొనియాడెదన్ (3) నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును (4)      ||ప్రేమా||

1వ చరణం

లోయలకంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ వెల యెంతో ఇహమందైనా పరమందైనా వెల కట్టలేనిది కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలియైన ప్రేమ – (2)      ||ప్రేమా||

2వ చరణం

మరణముకంటె బలమైనది – పునరుత్ధాన ప్రేమ మరణపు ముల్లును విరచినది – బలమైన ప్రేమ రక్తము కార్చి రక్షణ నిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ బలియైన ప్రేమ నాకై వెలియైన ప్రేమ –

Report Error