ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?

preemaamruththadhaaralu chindinchina yeesuku samamevaru

🎵 TG-677💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు? ఆ-ఆ-ఆ ప్రేమయెతానై నిలచి ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి ప్రేమనగరికి చనియె ||ప్రేమామృత్తధారలు చిందించిన||

1వ చరణం

నిశ్చలమైన ప్రేమజీవికి యిలలో తావేది ప్రేమ ద్రోహులేగాని ప్రియమున చేరరు వాని చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ||ప్రేమామృత్తధారలు చిందించిన||

2వ చరణం

ఎంత ఘోరపాపాత్ములనైన ప్రేమించునురారా పాపభారముతో రారా పాదములపై బడరా పాపుల రక్షకుడేసు తప్పక నిను రక్షించున్ ||ప్రేమామృత్తధారలు చిందించిన||

3వ చరణం

ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసెదవేల? రక్షణ దిన మిదియేరా తక్షణమే కనుగొనరా ఇదియే దేవుని వరము ముదమారగ జేకొనుము ||ప్రేమామృత్తధారలు చిందించిన||

Report Error