ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా
priyamaina yeesayyaa preemakee ruupamaa
🎵 TG-1423🌐 Telugu
పల్లవి
ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడనీ ప్రియమైన నీతో ఉండనీ నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా (2) ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యము నీ ప్రేమయే నా యెడ (2) ||ప్రియమైన||
1వ చరణం
జుంటి తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా (2) ||నా ప్రియుడా||
2వ చరణం
ఎంతగానో వేచియుంటిని ఎవరు చూపని ప్రేమకై ఎదుట నీవే హృదిలో నీవే నా మనసులోన నీవే ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించె హృదయం