ప్రియతమ బంధమా – నా
priyathama bandhamaa – naa
🎵 TG-1784🌐 Telugu
పల్లవి
ప్రియతమ బంధమా – నా హృదయపు ఆశ్రయ దుర్గమా అనుదినం అనుక్షణం – నీ ఒడిలో జీవితం ధన్యము కృతజ్ఞతతో పాడెదను నిరంతరము స్తుతించెదను ||ప్రియతమ||
1వ చరణం
అంధకారపు సమయములోన – నీతి సూర్యుడై ఉదయించావు గమ్యమెరుగని పయనములోన – సత్య సంధుడై నడిపించావు (2) నా నిరీక్షణ ఆధారం నీవు నమ్మదగిన దేవుడవు నీవు కరుణ చూపి రక్షించినావు కరుణామూర్తి యేసు నాథా వందనం వందనం దేవా – వందనం వందనం అనుదినం అనుక్షణం నీకే నా – వందనం వందనం ||కృతజ్ఞతతో||
2వ చరణం
పరమ తండ్రివి నీవేనని – పూర్ణ మనసుతో ప్రణుతించెదను పరిశుద్ధుడవు నీవేనని – ప్రాణాత్మలతో ప్రణమిల్లెదను విశ్వసించిన వారందరికి నిత్య జీవము నొసగె దేవా