రాకడ సమయంలో – కడబూర

raakada samayanloo – kadabuura

🎵 TG-2836🌐 Telugu
పల్లవి

రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) రావయ్య యేసయ్య – వేగరావయ్యా రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2)       ||రాకడ||

1వ చరణం

యేసయ్య రాకడ సమయంలో ఎదురేగె రక్షణ నీకుందా? లోకాశలపై విజయం నీకుందా? (2)       ||రావయ్య||

2వ చరణం

ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే దీన మనస్సుందా? దినమంతా దేవుని సన్నధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? శ్రమలోన సహనం నీకుందా? స్తుతియించే నాలుక నీకుందా? ఆత్మలకొరకైన భారం నీకుందా? నీ పాత రోత జీవితము నీ పాప హృదయం మారిందా? నూతన హృదయంతో ఆరాధన నీకుందా? అన్నీటికన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా? ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా?

Report Error