రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని
raaraajagu yeesuninaamam ramyanbagu deevuni
పల్లవి
రారాజగు యేసునినామం రమ్యంబగు దేవుని నామం ఈశుండగు యేసునినామం ఈధర నిదె పావననామం యేసునినామం దేవునినామం రమ్యంబగు దేవుని నామం ||రారాజగు యేసునినామం||
1వ చరణం
గగనమువీడిన గురునామం కలుషాత్మలబ్రోచెడు నామం ||రారాజగు యేసునినామం||
2వ చరణం
స్లీవాంకముగల యినామం సుజనుల జేసెడు స్థిరనామం ||రారాజగు యేసునినామం||
3వ చరణం
విజయం బొపగెడు నిజనామం విమలాత్ముల కిదివరనామం ||రారాజగు యేసునినామం||
4వ చరణం
మనమున కిది యజ్జ్వలనామం జనములకిదియే ఋజునామం ||రారాజగు యేసునినామం||
5వ చరణం
ఈధరస్తుతులను గొనునామం ఈయేసుని యమృతనామం ||రారాజగు యేసునినామం||