రారె గొల్లవారలారా నేటి రాత్రి

raare gollavaaralaaraa neeti raathri

🎵 TG-105💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రారె గొల్లవారలారా నేటి రాత్రి బేత్లెహేము నూర జేరి మోక్షదూత కోరి దెల్పెను క్రీస్తు వారి జాడకన్ను లారా జూతము వేగ ||రారె గొల్లవారలారా||

1వ చరణం

పుట్టు చావులు లేనివాడఁట పసుల తొట్టిలోపలఁ బుట్టెనేడఁట ఎట్టి వారలను జే పట్టి పాపము లూడఁ గొట్టి మోక్షపుత్రోవఁ బెట్టు వాడట వేగ ||రారె గొల్లవారలారా||

2వ చరణం

బహుకాలమాయెను వింటిమి నేడు మహికివచ్చుట కనుగొంటిమి విహితముతోడ సేవించి వత్తము మోక్ష మహితుని గని దుఃఖ రహితులమవుదము. ||రారె గొల్లవారలారా||

Report Error