రారే మన యేసు స్వామిని జూతము కోర్కె లూర ప్రియు లారా పేర్మిని గూరిమి భక్తులఁ విందుట భూరిద యామృత సారము లోలికెడు చారు కటాక్ష వి శాలేక్షణుఁడఁట నారకులగు నర నారీజనులకు దారక మొసఁగను దానె పిలుచునఁట దారుణ పాప మ హారణ్యమునకుఁ గారుచిచ్చు గతి గంపడువాఁడట ఘోరదరిద్రతఁ గూల్చెడివాఁడట సారం బగు తన సభకు మకుటమఁ ట ||రారే మన||
పతిత పావనమౌ వేల్పఁట అనాది దేవ సుతుడై యిలఁ జేరి నాఁడఁట సతతము కడు దురి తతమోయుతమగు ప్రతి దేశమునకు హితభాస్కరుఁడఁట అతిలిత మోక్షో న్నత గుణగణుఁడఁట కుతలంబున స ద్గతి రహితంబగు పతితులఁ గావను మృతుడైనాఁ డఁట అతిపుణ్య తను క్షత శోణితమును వ్రతముగ సిలువను నతడొసంగెనఁట మృతిని జయించుచు బ్రతికి లేచెనఁట మతి నమ్మిన మన గతి యితఁడేనఁట ||రారే మన||
తుదిలేని మహిమవాఁడఁట తనుఁగొల్చు సాధు హృదయుల సొమ్ము మూటఁట చెదరిన గొఱ్ఱెల వెదకవచ్చెనఁట చిదురుపలగు జన హృదయము లన్నిటఁ బదిలముగా నె మ్మది నిడువాఁడఁట నదితట మఠ జన వదనముల స మ్మద శుభవార్తనుఁ బలికినవాఁడఁట సదయత నంధుల కక్షుల నిడెనఁట వెదకి బధిరులకు వీను లొసఁగె నఁట సదమల మోక్ష ప్రదుఁడగు విభుఁడఁట యిదిగో మనకిత డేలినవాఁడఁట ||రారే మన||