రావయ్య యేసునాధా మా రక్షణ మార్గము
raavayya yeesunaadhaa maa rakssanna maargamu
పల్లవి
నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు
1వ చరణం
హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను "రావయ్య“
2వ చరణం
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు "రావయ్య"
3వ చరణం
పాపుల మయ్యమేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియు పారద్రోలుటకు "రావయ్య"
4వ చరణం
అందమైన నీదు పరమానంద పురమందు మే మందరము జేరి యానందించుటకు "రావయ్య"