రావయ్య యేసునాధా మా రక్షణమార్గము
raavayya yeesunaadhaa maa rakssannamaargamu
పల్లవి
రావయ్య యేసునాధా మా రక్షణమార్గము నీ సేవఁ జేయ మమ్ముఁ జేపట్టుటకు ||రావయ్య యేసునాధా||
1వ చరణం
హద్దు లేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్ధులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య యేసునాధా||
2వ చరణం
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబు లన్నియు ఖండించుటకు ||రావయ్య యేసునాధా||
3వ చరణం
మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగాఁ జేసి దారిఁ జూపుటకు ||రావయ్య యేసునాధా||
4వ చరణం
పాపుల మయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబు లన్నియుఁ పారఁ దోలుటకు ||రావయ్య యేసునాధా||
5వ చరణం
అందమైన నీదు పరమానంద పురమందు మే మందరముజేరి ఆనందించుటకు ||రావయ్య యేసునాధా||