రావయ్య యేసునాథా మా రక్షణ
raavayya yeesunaathaa maa rakssanna
🎵 TG-2661🌐 Telugu
పల్లవి
రావయ్య యేసునాథా మా రక్షణ మార్గము నీ సేవ జేయ మమ్ము జేపట్టుటకు హద్దులేక మేము ఇల మొద్దులమై యుంటిమి మా కొద్ది బుద్దులన్ని దిద్ది రక్షింపను ||రావయ్య||
1వ చరణం
నిండు వేడుకతోను మమ్ము బెండువడక చేసి మా గండంబులన్నియు ఖండించుటకు మేర లేని పాపము మాకు భారమైన మోపు నీవు దూరంబుగా జేసి దారి జూపుటకు పాపులమయ్య మేము పరమ తండ్రిని గానకను మా పాపంబులన్నియు పారద్రోలుటకు అందమైన నీదు పరమానంద పురమందు మేమందరము జేరి యానందించుటకు