రక్షింపబడిన నీవు – లోకాశలపైనే
rakssinpabadina neevu – lookaashalapainee
🎵 TG-2562🌐 Telugu
పల్లవి
రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు గురి నిలిపి పయనిస్తున్నావా రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు అన్నట్టు జీవిస్తున్నావా (2) యేసే లేని నీ బ్రతుకులో వెలుగే లేదని తెలుసుకో యేసే లేని జీవితానికి విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన||
1వ చరణం
మంటితోనే నిను చేసినా కంటి పాపగా కాపాడెనే మాటి మాటికి పడిపోయినా శాశ్వత ప్రేమతో ప్రేమించెనే ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా యేసే లేనిదే – పరలోకానికి ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే||
2వ చరణం
యేసులోనే నీ రక్షణ యేసులోనే నిరీక్షణ యేసులోనే క్షమాపణ చేసుకో మరి ప్రక్షాళన ఎంతో ప్రేమను – నీపై చూపించెను తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా