రండి యుత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
randdi yutsaahinchi paaddudamu rakssanna durgamu mana prabhuvee
1వ చరణం
రండి కృతజ్ణత స్తోత్రముతో - రారాజు సన్నిది కేగుదము సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోష గానము చేయుదము "రండి "
2వ చరణం
మన ప్రభువే మహా దేవుండు - ఘనమహాత్యము గల రాజు భూ మ్యాగాధపు లోయలలో - భూతల శిఖరములాయనవే " రండి "
3వ చరణం
సముద్రము సృష్తించె నాయనదే - సత్యుని హస్తమే భువి జేసెన్ ఆయన దైవము పాలితుల - మాయన మేపెడి గొర్రెలము "రండి"
4వ చరణం
ఆ ప్రభు సన్నిది మోకరించి - మాయన ముందర మ్రొక్కుదము ఆయన మాటలు గైకొనినా - నైనవి మనకెంతో మేలగును "రండి"
5వ చరణం
తండ్రికుమార శుద్ధాత్మకును - దగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌనామేన్ "రండి"