రండి పాడ దూతలారా నిండు

randi paada duuthalaaraa nindu

🎵 TG-132💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రండి పాడ దూతలారా నిండు సంతోషంబుతో యేసుని జన్మంబు గూర్చి ఈ భూలోకమంతట రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి.

1వ చరణం

మందగాయు గొల్లలార! మనుష్యులతో నేడు వాసంబు జేయుచున్నాఁడు వాసిగాను దేవుండు రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి. ||రండి పాడ||

2వ చరణం

జ్ఞానులారా! మానుడింక యోచనలం జేయుట మానుగాను వెదకుడేసున్ చూచుచు నక్షత్రమున్ రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి. ||రండి పాడ||

3వ చరణం

పరిశుద్ధులారా! మీరు నిరీక్షించుచుండిన యేసు ప్రభువాలయంబు యేతెంచెను చూడుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి. ||రండి పాడ||

4వ చరణం

పశ్చాత్తాప మొందియున్న పాపులార! మీకు వి ముక్తి గల్గె; శక్తి నొంది రక్తి నేసుంజేరుడి రండి నేడు పుట్టినట్టి రాజు నారాధించుడి. ||రండి పాడ||

Report Error