రండి సువార్త సునాదముతో రంజిలు
randi suvaartha sunaadamuthoo ranjilu
పల్లవి
రండి సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభుయేసు దయానిధి సన్నిధికి
1వ చరణం
యేసే మానవ జాతి వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పతిత పావన నామం భాసర క్రైస్తవ శుభనామం ||రండి సువార్త||
2వ చరణం
యేసే దేవుని ప్రేమ స్వరూపం యేసే సర్వేశ్వర ప్రతిరూపం యేసే ప్రజాపతి పరమేశం ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి సువార్త||
3వ చరణం
యేసే సిలువను మోసిన దైవం యేసే ఆత్మల శాశ్వత జీవం యేసే క్షమాపణ అధికారం దాసుల ప్రార్థన సహకారం ||రండి సువార్త||
4వ చరణం
యేసే సంఘములో మనకాంతి యేసే హృదయములో ఘనశాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసిపాపల దీవెన మూర్తి ||రండి సువార్త||
5వ చరణం
యేసే జీవన ముక్తికి మార్గం యేసే భక్తుల భూతల స్వర్గం యేసే ప్రపంచ శంతికి సూత్రం వాసిగ నమ్మిన జనస్తోత్రం. ||రండి సువార్త||