రేపు మాపు గూడరమ్య మైన

reepu maapu guudaramya maina

🎵 TG-467💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

రేపు మాపు గూడరమ్య మైన గింజల్ ప్రీతితోను జల్లి వేచియుందము కాపుతోడ నుండి దాపు నుండు పంట ఏపు మీరఁ పంటఁకోసి కొందము ||రేపు మాపు||

1వ చరణం

సందియంబు లేల స్వామి సేవ యందు వందనంబు తోడ విత్తుచుందము కొందలంబు లేక కష్టవృత్తి చేసి యందరంబు చేరి యానందింతము ||రేపు మాపు||

2వ చరణం

ప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు రంబుల్ ప్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం తటన్ సేమ మొప్ప నాటినాయకుండు రాఁగన్ నిండు పంటఁ కోసం గూర్చుకొం దము. ||రేపు మాపు||

Report Error