ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా

rreemdu messeeya janminchenu shreedaa

🎵 TG-111💿 Andhra Kraistava Keerthanalu🌐 Telugu
పల్లవి

ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భువించెను వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప ||ఱేఁడు మెస్సీయ||

1వ చరణం

మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో చనకర్త యితఁ డౌను ||ఱేఁడు మెస్సీయ||

2వ చరణం

పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు మహిమ యటంచును ||ఱేఁడు మెస్సీయ||

3వ చరణం

కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న మ్మలోచన మహ త్వ మ్మొక్కుమ్మడినాతని ||ఱేఁడు మెస్సీయ||

4వ చరణం

సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో నిండిన సర్వంసహా స్థలిపై ||ఱేఁడు మెస్సీయ||

5వ చరణం

వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను చింతతోడను మాయా సంగతులగు వారి యంతములేనట్టి యాపదను వీక్షించి ||ఱేఁడు మెస్సీయ||

6వ చరణం

చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక విభుఁడాలో చన కర్త జన్మించె ||ఱేఁడు మెస్సీయ||

7వ చరణం

అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున హెబ్రీ వంశమునందు ||ఱేఁడు మెస్సీయ||

Report Error